News March 13, 2025
సంగారెడ్డి: చదివితే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్

కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏ సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Similar News
News October 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 16, 2025
MNCL: ఈ నెల 17న మినీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు ఈ నెల 17న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. మెరీనా ప్లాంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2190 పోస్టులకు మేళ నిర్వహిస్తున్నారు. పది, ITI, డిగ్రీ, ఎంబీఏ
చేసి 18 నుంచి 40 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. సీవీ రామన్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News October 16, 2025
IPS పూరన్ భార్య, బావమరిదిపై కేసు

IPS పూరన్ కుమార్ సూసైడ్, ఆపై ASI సందీప్ ఆత్మహత్య వ్యవహారం మరిన్ని ట్విస్టులతో సాగుతోంది. సందీప్ భార్య ఫిర్యాదుతో పూరన్ భార్య అమ్నీత్(IAS), బావ మరిది అమిత్ రట్టన్(MLA), సెక్యూరిటీ ఆఫీసర్ సుశీల్, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ వీడియో, సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆయన ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. కేసు పెట్టే వరకు సందీప్ పోస్టుమార్టానికి ఆయన కుటుంబం అంగీకరించలేదు.