News March 8, 2025
సంగారెడ్డి: చదువుతోనే మహిళకు సాధికారత: కలెక్టర్

మహిళా సాధికారతకు చదువే ప్రధాన ఆధారమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అమ్మాయి చదువు కుటుంబానికి వెలుగుని ఇస్తుందని చెప్పారు. మహిళల సమానత్వం ఇంటి నుంచి ప్రారంభం కావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
Similar News
News November 19, 2025
ఎనుమాముల మార్కెట్‌లో పల్లికాయ క్వింటా రూ.6,210

చాలా రోజుల తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పల్లికాయ (వేరుశనగ) తరలివచ్చింది. ఈ క్రమంలో పచ్చి పల్లికాయ క్వింటాకు రూ. 6,210 ధర రాగా, సూక పల్లికాయ రూ.4,500 ధర పలికింది. మరోవైపు, మార్కెట్‌కి వచ్చిన మొక్కజొన్న (మక్కలు) ధర భారీగా తగ్గింది. సోమవారం రూ. 2,080 ఉన్న ధర, ఈ రోజు రూ. 2,030కి పడిపోయింది.
News November 19, 2025
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. కడప(D) పెండ్లిమర్రి సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. తానూ రైతు బిడ్డనే అని, నాన్నకు వ్యవసాయంలో సాయం చేసేవాడినని వెల్లడించారు. అన్నదాతల కష్టాలు తెలుసు కాబట్టే అన్నదాత సుఖీభవ కింద రూ.14వేలు అందజేశామని పేర్కొన్నారు. సాగు తీరు మారి, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు పంచసూత్రాలను అమలు చేస్తున్నామన్నారు.
News November 19, 2025
అన్నదాత సుఖీభవ రెండో విడత.. రూ.3,135 కోట్లు జమ

AP: పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన 46,85,838 రైతుల అకౌంట్లలో రూ.3,135 కోట్లను జమ చేశారు. PM కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద రూ.5వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి.


