News March 7, 2025
సంగారెడ్డి: చాడకు ఎమ్మెల్సీ పదవి దక్కేనా..?

TGలో ఎమ్మెల్యే కోటాలో ఐదు MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో CPI హుస్నాబాద్ టికెట్ కావాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. MLC స్థానాల్లో Ex. MLA చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా రెండు MLC స్థానాలు కేటాయిస్తామని సీపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చాడకు ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదా అని వేచి చూడాలి.
Similar News
News November 22, 2025
బాపట్ల: ‘భూ సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలి’

భూ సమస్యలను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి భూ అర్జీని నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు పాల్గొన్నారు.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతానికి దివ్య ముహూర్తం నేడే..

శని దోష నివారణ కోసం చేసే 7 శనివారాల వ్రతాన్ని నేడు ప్రారంభించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ‘వ్రతాన్ని ఈరోజు మొదలుపెడితే వచ్చే ఏడాది JAN3 పౌర్ణమి రోజున పూర్తవుతుంది. పౌర్ణమి సంయోగం వల్ల అధిక ఫలితం ఉంటుంది. ఏడో వారానికి ముందు వైకుంఠ ఏకాదశి రావడం, వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం వల్ల శనిదేవుడు, విష్ణువు అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు’ అంటున్నారు. వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 22, 2025
సమీకృత దాణాతో పశువులకు కలిగే మేలు

పశువుల పోషణలో భాగంగా పాడిపశువులకు సమతుల ఆహారం అందించడం ముఖ్యం. రోజూ అందించే దాణాతో పాటు సమీకృత దాణా కూడా అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాల దిగుబడి కూడా పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉన్న దినుసులను తగిన మోతాదులో కలిపి సమీకృత దాణాను తయారు చేయవచ్చు. ఇలా స్వయంగా తయారు చేసుకున్న దాణాలో మెులాసిస్ అరోమా పొడిని 250-500 గ్రాములు కలిపితే దాణా సువాసన కలిగి, రుచిగా ఉంటుంది.


