News June 2, 2024
సంగారెడ్డి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గుర్రపు శ్రీనివాస్ కుమారుడు బద్రీనాథ్(17) హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షలు రాశాడు. వారం కిందట అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతోపాటు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News September 12, 2024
మెదక్: సెప్టెంబర్ 17 ముఖ్య అతిధిగా కేశవరావు
ఈనెల 17న నిర్వహించే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మెదక్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు హాజరుకానున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోజు ఉదయం పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారు. ఇందుకోసం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 11, 2024
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పెంపు
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మెన్స్ కం మెరిట్ స్కాలర్షిప్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 25 వరకు ప్రభుత్వం పొడిగించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News September 11, 2024
చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలి: కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హెచ్ఎండిఏ వెబ్ సైట్లో 8 మండలాలకు సంబంధించిన మ్యాపింగ్ ఉంచాలని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.