News February 19, 2025
సంగారెడ్డి: చెరువులో మునిగి ఇద్దరు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. చర్చి గాగిల్లపూర్కు చెందిన వల్లపు నరేష్(26) అతని స్నేహితుడు శంకర్(22) వావిలాల గ్రామంలోని పీర్ష చెరువులో ఈత కొట్టడానికి దిగగా చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తూ చెరువులో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 19, 2025
అనంతపురంలో విద్యార్థిని మిస్సింగ్.. కేసు నమోదు

అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. స్థానిక గఫూర్ కాలనీకి చెందిన సాయి గోపిక SRIT ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3rd ఇయర్ చదువుతోంది. తల్లితండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి.. నిన్న తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు 1 టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
News October 19, 2025
బాపట్లలో రేపు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటించారు. ఈనెల 20న దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇవ్వడానికి ప్రజలు రావద్దని సూచించారు.
News October 19, 2025
NZB: 23 వరకు వైన్స్లకు దరఖాస్తుల స్వీకారం: ES

నిజామాబాద్ జిల్లాలో వైన్స్ షాపులకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 27న డ్రా తీస్తారని చెప్పారు. కాగా జిల్లాలోని 102 వైన్స్లకు సంబంధించి నిన్నటి వరకు 2,633 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇందులో నిజామాబాద్ పరిధిలో 907, బోధన్ 427, ఆర్మూర్ 577, భీమ్గల్ 355, మోర్తాడ్ పరిధిలో 366 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.