News March 22, 2025
సంగారెడ్డి: చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి నుంచి మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు 100% చెల్లించిన ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 25% డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
పెద్దపల్లి: ‘డిసెంబర్ 31లోపు దరఖాస్తులు సమర్పించాలి’

స్కాలర్షిప్ దరఖాస్తులు డిసెంబర్ 31లోపు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పెండింగ్ ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులపై సమీకృత జిల్లా కలెక్టరేట్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్, హెచ్డబ్ల్యూఓలు, సంబంధిత అధికారులు ఉన్నారు.
News November 25, 2025
సర్పంచి రిజర్వేషన్లు.. జిల్లెల్లలో ఆశలు- నిరాశలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నవంబర్ 23న నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తంగళ్లపల్లి మండలంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జిల్లెల్ల గ్రామంలోని నాలుగు కూడళ్లలో, టీ స్టాళ్ల వద్ద పంచాయతీ ఎన్నికలపై చర్చలు మరింత జోరందుకున్నాయి. పీఠం ఎవరికి దక్కుతుందన్న ఊహాగానాలు వేగంగా మారుతుండగా, రిజర్వేషన్ కారణంగా కొందరు ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.
News November 25, 2025
NTR: జోగి రమేష్కి రిమాండ్ పొడిగింపు

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి జనార్దనావుతో సహా ఏడుగురు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం రిమాండ్ పొడిగించింది. రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 9 వరకు రిమాండ్ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


