News April 24, 2024
సంగారెడ్డి : ‘జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి’
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకోసం ఈనెల 23వ తేదీ లోపు DPRO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. అక్రిడేషన్‌కార్డు, ఫారం 12డీ, ఓటర్‌కార్డు జిరాక్స్ ప్రతులను DPRO కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
Similar News
News January 8, 2025
మెదక్: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.
News January 8, 2025
పటాన్చెరు: బైక్‌లో చున్నీ ఇరుక్కొని మహిళ మృతి
బైక్‌లో చున్నీ చిక్కుకొని మహిళ మృతి చెందిన ఘటన అమీన్పూర్లో నిన్న జరిగింది. పటాన్చెరు డివిజన్లోని జీపీ కాలనీకి చెందిన నవదీప్ దూలపల్లిలో MCA చేస్తున్నాడు. కాలేజీలో పేరెంట్స్ మీటింగ్‌కు తల్లి రజితను బైక్‌పై తీసుకెళ్తుండగా ఆమె చున్ని బైక్ టైరులో చిక్కుకొని కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదైనట్లు SI దుర్గయ్య తెలిపారు.
News January 8, 2025
మెదక్: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు
సంక్రాంతి సందర్భంగా మెదక్ రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 10, నుంచి 18 వరకు (14, 15 మినహా) 280 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ప్లాన్ చేశారు. కాగా సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్లో అదనందగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ సర్వీసుల్లో ‘మహాలక్ష్మి’ వర్తింపుపై క్లారిటీ రావాల్సి ఉంది.