News April 24, 2024
సంగారెడ్డి : ‘జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి’

పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకోసం ఈనెల 23వ తేదీ లోపు DPRO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. అక్రిడేషన్‌కార్డు, ఫారం 12డీ, ఓటర్‌కార్డు జిరాక్స్ ప్రతులను DPRO కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
Similar News
News April 17, 2026
మెదక్ జిల్లాకు రెండు డయాలసిస్ కేంద్రాలు

రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 59 ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా.. మెదక్ జిల్లాలోని రామాయంపేట, కౌడిపల్లి కేంద్రాలకు అనుమతులు లభించాయి. త్వరలోనే ఐదు పడకల సామర్థ్యంతో ఈ కేంద్రం అందుబాటులోకి రానుంది. దీంతో కిడ్నీ బాధితులకు స్థానికంగానే ఉచితంగా డయాలసిస్ సేవలు అందనున్నాయి.
News April 17, 2026
మెదక్: కార్మికుల కొత్త వేతన ఒప్పందం ఖరారు: CITU

సీఐటీయూ చొరవ, కార్మికుల ఐక్యతతోనే మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై శుక్రవారం సంగారెడ్డి లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంతకాలు పూర్తయ్యాయి. పాత ఒప్పందం మార్చి 31తో ముగియగా, కొత్త ఒప్పందం ద్వారా కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News April 17, 2026
మెదక్: ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ 2026-27 విద్యా సంవత్సరానికి పలు కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.రమేశ్ తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


