News June 12, 2024
సంగారెడ్డి: జర్మనీ భాషా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

టాంకాం ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం జర్మనీ భాష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిని వందన తెలిపారు. ఆసక్తి గలవారు www.tomcom.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టాంకాం మొబైల్ యాప్‌లో సైతం దరఖాస్తులు సమర్పించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 17, 2025
MDK: ఎన్నికల్లో ముగ్గురు బాల్య మిత్రులు గెలుపు

తూప్రాన్ మండలం ఘనాపూర్ జీపీలో బాల్యమిత్రులు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఎస్ఎస్సీ బాల్య మిత్రులైన సురేష్, వేణు, సయ్యద్ అన్వర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. వేణు, సురేష్‌లకు వార్డులలో సభ్యులుగా పోటీ చేయడానికి రిజర్వేషన్ అనుకూలించింది. అన్వర్‌కు అనుకూలించకపోవడంతో తల్లి నజ్మా బేగంను ఎన్నికలలో నిలిపారు. సురేష్, వేణు, నజ్మా బేగం, (అన్వర్ తల్లి) వార్డు సభ్యులుగా గెలిచారు.
News December 17, 2025
మెదక్: రుణదాతల వేధింపులతో వ్యక్తి సూసైడ్

అప్పు ఇచ్చినవారు వేధించడంతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని కువత్ ఇస్లాంకు చెందిన మహమ్మద్ షాదుల్లా హుస్సేన్ (45) పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవిస్తున్నాడు. రూ.30 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫాతిమా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 17, 2025
MDK: గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

చిన్నశంకరంపేట మండలం జంగరాయి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గుండెపోటుతో అస్పత్రిలో చేరిన సంజీవరెడ్డి మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు అస్పత్రిలో చేరారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


