News August 3, 2024
సంగారెడ్డి: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జు అయిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పుల్కల్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
మెదక్: గ్రామాల్లో.. వాట్సప్ ప్రచారాలు

పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు అభ్యర్థులు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో.. ప్రచారాలను విస్తృతం చేశారు. తమ అనుచరులతో ప్రచార వీడియోలు సైతం తీయించి.. వాటికి సాంగ్స్ క్రియేట్ చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు.
News December 8, 2025
MDK: బ్యాలట్ బాక్స్ సీల్, సౌకర్యాల తనిఖీపై అబ్జర్వర్ కీలక సూచనలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్లు విధులలో నిబద్ధతతో పనిచేయాలని జిల్లా సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ సూచించారు. ఐడీఓసీ సమావేశ హాల్లో శిక్షణా కార్యక్రమంలో 82 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించడం, సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు, బ్యాలట్ బాక్స్ సీల్, సౌకర్యాల పరిశీలన, రిపోర్ట్ సమర్పణలపై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
News December 8, 2025
మెదక్: చెక్‌పోస్టును సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్

మెదక్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎలక్షన్ సాధారణ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ సూచించారు. సోమవారం మంబోజిపల్లి వద్ద చెక్‌పోస్టును సందర్శించారు. వాహనాల తనిఖీలు, నగదు, వస్తువుల రవాణా, అమలు చేస్తున్న నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్‌పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయం, సమాచార అంశాలపై పలు సూచనలు చేశారు.


