News July 22, 2024
సంగారెడ్డి: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ ఆల్టో కారు గుర్తుతెలియని వ్యక్తిని ఢీ కొట్టి నాలుగు కిలోమీటర్ల మేరకు ఈడ్చుకు వచ్చింది. కంకులు టోల్ ప్లాజా వద్ద కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 11, 2024
కోమటి చెరువుపై బతుకమ్మ వేడుకలు.. హరీష్ రావుతో సెల్ఫీలు
సద్దుల బతుకమ్మ సందర్భంగా సిద్దిపేటలోని కోమటి చెరువుపై గురువారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగాయి. రంగురంగుల పూలతో విభిన్న ఆకృతుల్లో బతుకమ్మలను ఆడపడుచులు పేర్చి ఒకచోట చేర్చి ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు .స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తిలకించారు. ఆడపడుచులు హరీష్ రావుతో సెల్ఫీలు దిగాలని తాపత్రయపడగా స్వయంగా హరీష్ రావే సెల్ఫీ ఫోటోలు క్లిక్ మనిపించారు.
News October 10, 2024
సిద్దిపేట: ఒకే ఇంట్లో నలుగురికి MBBS సీట్లు
సిద్దిపేటకు చెందిన రామచంద్రం, శారద దంపతుల నలుగురు కుమార్తెలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీట్లు పొందారు. పెద్ద కుమార్తె మమత 2018లో MBBSలో చేరి డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కుమార్తెలు రోహిణి, రోషిణి MBBSలో సీటు సాధించారని తండ్రి రామచంద్రం తెలిపారు. KCR జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. నేడు ఎమ్మెల్యే హరీశ్ రావును కలిశారు.
News October 10, 2024
సబ్జెక్ట్ టీచర్ లేని ఉన్నత పాఠశాలకు ప్రాధాన్యత నివ్వాలి: పీఆర్టీయూ
సబ్జెక్ట్ టీచర్ లేని ఉన్నత పాఠశాలల్లో మొదటి ప్రాధాన్యతగా భర్తీ చేయాలని మెదక్ డీఈవో రాధాకిషన్‌ను పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ కోరారు. సింగిల్ స్కూళ్లలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తూ ఆ పాఠశాలల్లో నూతన ఉపాధ్యాయులతో భర్తీ చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య కాకుండా సాంక్షన్ పోస్ట్ ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నింపాలని కోరారు. ఇందులో సంగమేశ్వర్, ఖదీర్, శ్రీనివాస్ ఉన్నారు.