News March 17, 2025
సంగారెడ్డి: జిల్లాకు చేరుకున్న పదో తరగతి ప్రశ్నా పత్రాలు

జిల్లాలో ఈ నెల 21 నుంచి నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నా పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రశ్నా పత్రాలను రూట్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ మండల పోలీస్ స్టేషన్ లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
జగిత్యాల: ‘ర్యాలీని విజయవంతం చేయాలి’

తమ సమస్యల పరిష్కారం కోసం ముంబాయిలో ఈ నెల 17న నిర్వహిస్తున్న రిప్రెజెంటేటివ్స్ ర్యాలీని విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని కోరారు. నాయకులు రాము, సునీల్, అరవింద్ పాల్గొన్నారు.
News November 8, 2025
ముగిసిన జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ నామినేషన్ ప్రక్రియ

జగిత్యాల జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ 2025-27 కార్యవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగిసినట్లు జిల్లా అడహక్ కమిటీ సభ్యుల వెల్లడించారు. మెయిన్ బాడీ 7 పదవులకు 9 నామినేషన్లు, జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లకు 18 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. ఈరోజు 2 పదవులకు విత్ డ్రా చేసుకున్నారని, ఈనెల 15న ఎన్నికలు నిర్వహిస్తామని, పాస్టర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News November 8, 2025
బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారిగా డా.ఎం.సత్య ప్రకాష్

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో KNR ప్రాంతీయ సమన్వయ అధికారిగా డాక్టర్ ఎం.సత్య ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ప్రాంతీయ సమన్వయ అధికారిగా పనిచేసిన డా.వంగల శ్రీనివాస్ ఉద్యోగ విరమణ పొందగా ఈ బాధ్యతను వీరు స్వీకరించారు. ఈ సందర్భంగా SRR కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


