News December 31, 2024

సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ హుడా లే అవుట్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాలు.. యూటర్న్ తీసుకునే క్రమంలో టిప్పర్‌, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు హరీశ్, బన్నీ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 17, 2025

BREAKING.. మెదక్: కొడుకును నరికి చంపిన తండ్రి

image

వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(30) మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ పడటంతో పడుకున్న శ్రీకాంత్‌ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.

News January 16, 2025

మెదక్: సర్వేను పక్కగా నిర్వహించాలి: కలెక్టర్

image

రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పంచాయతీ సెక్రటరీ ధనలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

News January 16, 2025

3 రోజుల్లో నుమాయిష్‌కు 2,21,050 మంది

image

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్‌కు రాగా.. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.