News March 23, 2025
సంగారెడ్డి: జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు విడుదల

జిల్లాలో ఆదివారం అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు ప్రకటించారు. అత్యధికంగా వట్పల్లిలో 37.7, పాల్వంచలో 37.6, ఆందోలు మండలం అల్మాయిపేట 36.9, కల్హేర్లో 36.7, ఆందోలు మండలం అన్నాసాగర్లో 36.6, నారాయణఖేడ్ లో 36.4, జహీరాబాద్ మండలం అల్గోల్లో 36.2, చౌటకూర్, కందిలలో 36.1, నిజాంపేట, కోహీర్ మండలం దిగ్వల్, కొండాపూర్, పుల్కల్ లలో 36.0 ఉష్ణోగ్రత నమోదైనట్లు వివరించారు.
Similar News
News March 29, 2025
నంద్యాల: ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ఉగాది సందర్భంగా నంద్యాల మీదుగా రెండు రైళ్ల ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-హుబ్లీ మధ్య ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 31న రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి హుబ్లీకి బయలుదేరే రైలు(07271) నంద్యాలకు రాత్రి 12:50 గంటలకు చేరనుంది. అలాగే వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు హుబ్లీ నుంచి గుంటూరుకు బయలుదేరే రైలు(07272) నంద్యాలకు రాత్రి 7:50 గంటలకు చేరనుంది.
News March 29, 2025
మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు..

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 12,566, కనిష్ఠ ధర రూ. 9,211, పసుపు గోళ గరిష్ఠ ధర రూ. 11,888, కనిష్ఠ ధర రూ. 9,051, పసుపు చూర గరిష్ఠ ధర రూ. 9,452, కనిష్ఠ ధర రూ. 8,183లుగా పలికాయి. కాగా ఈ సీజన్లో మొత్తం కొనుగోళ్ళు 36,557 క్వింటాళ్లు కాగా, ఈ రోజు 325 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయి.
News March 29, 2025
MDCL: గిరిజన తండాలు.. గొప్పగా మారేనా..?

MDCL మల్కాజిగిరి పరిధిలోని 61 గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాల్లో అనేక గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మున్సిపాలిటీల కిందికి వెళ్లనున్న నేపథ్యంలో గిరిజన తండాలు గొప్ప అభివృద్ధి ప్రాంతాలుగా మారుతాయా..? అని అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మా వెనుకబడ్డ గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.