News March 23, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదు’

జిల్లాలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ శనివారం తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేసినట్లు చెప్పారు. జిల్లాలు ఎక్కడైనా పంట నష్టం జరిగితే మండల వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News March 26, 2025
నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మల్కాపూర్లో అత్యధికంగా 40.2℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిజామాబాద్ పట్టణం, మంచిప్ప, కోటగిరిలో 40, మోస్రా 39.9, ధర్పల్లి, లక్మాపూర్ 39.8, యెడపల్లె, మెండోరా 39.7, ఎర్గట్ల, పెర్కిట్, మోర్తాడ్ 39.5, వేంపల్లి, వైల్‌పూర్ 39.3, సిరికొండ, ముప్కాల్, కమ్మర్పల్లి, తుంపల్లి 39.2, మాచర్ల, భీంగల్లో 39.1℃ఉష్ణోగ్రత నమోదైంది.
News March 26, 2025
పోరాటయోధుడు ధర్మభిక్షం

స్కూల్లో తన పట్టాభిషేక రజతోత్సవాలను జరపాలన్న నిజాం ఆదేశాలను ధిక్కరించి సంచలనం సృష్టించాడో విద్యార్థి. ఆయనే బొమ్మగాని ధర్మభిక్షం. NLG జిల్లా ఊకొండిలో 1922 ఫిబ్రవరి 15న లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు జన్మించాడు ధర్మభిక్షం. 1942లో CPIలో చేరి నిజాంపై సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టి యుద్ధరంగంలోకి దిగి, సాయుధ పోరాటాన్ని విస్తరించారు. మూడు సార్లు MLAగా, రెండు సార్లు MPగా గెలుపొందారు. నేడు ఆయన వర్ధంతి
News March 26, 2025
బాపట్ల జిల్లాలో రేపే ఎన్నిక.. గెలిచేదెవరు?

బాపట్ల జిల్లాలో వివిధ కారణాలతో స్థానిక సంస్థలో ఖాళీ అయిన వాటికి గురువారం ఎన్నిక జరగనుంది. జిల్లాలో నాలుగు ఉప సర్పంచులు, ఒక ఎంపీపీ, కో ఆప్టెడ్ ఎన్నిక జరగనుంది. పిట్టలవానిపాలెంలో ఎంపీపీకి, భట్టిప్రోలు మండలంలో కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక జరగనుంది. పెదవులిపర్రు, చెరుకుపల్లి మండలంలోని తుమ్మలపాలెం, పర్చూరు మండలంలోని తుమ్మలపాలెం, రేపల్లె మండలంలోని పేటేరులో ఉప సర్పంచులకు ఎన్నిక జరగనుంది.