News April 24, 2024
సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713851771382-normal-WIFI.webp)
సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. కోహిర్ మండలంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మృతదేహం వద్ద కత్తులను వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన వాసి అన్వర్ అలీ(28)గా గుర్తించారు. పాత తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 13, 2025
మెదక్: సంతోషంగా పండగను జరుపుకోవాలి: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736770436785_50139766-normal-WIFI.webp)
మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకున్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలాన్నారు.
News January 13, 2025
అందోల్: మాజీ ఎంపీ భౌతికకాయానికి మంత్రి నివాళులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736764350260_718-normal-WIFI.webp)
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
News January 13, 2025
సంక్రాంతి రైతన్న జీవితాల్లో వెలుగులు నింపాలి: కేసీఆర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736749534893_51703636-normal-WIFI.webp)
రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి అని మాజీ సీఎం KCR అన్నారు. ‘X’ వేదికగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన వల్లనే తెలంగాణలో వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాగుకు, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి రైతన్నల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.