News February 3, 2025
సంగారెడ్డి: జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు

జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య తగ్గి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు పెరగనున్నాయి. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుతో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు ఆయా మండలాల మాసాయిదా జాబితాను విడుదల చేశారు. 2019 ఎన్నికల సమయంలో జిల్లాలో 295 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 276, జడ్పీటీసీల సంఖ్య 27కు చేరింది.
Similar News
News November 17, 2025
నంద్యాల: పీజీఆర్ఎస్కు 81 ఫిర్యాదులు

నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.

బోసిపోయిన భూపాలపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం

ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా రిజస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయల్లో జరిగిన ఏసీబీ దాడుల తర్వాత భూపాలపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం బోసిపోయింది. భూపాలపల్లిలో రెండు రోజులుగా డాక్యుమెంట్, రైటర్ షాపులు తెరుచుకోక పోవడంతో భూమి క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మ్యారేజీ రిజిస్ట్రేషన్లు మాత్రమే కొనసాగుతున్నాయి.