News July 11, 2024
సంగారెడ్డి: జిల్లాలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

సంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గంజాయి, మాదకద్రవ్యాలు తరలిస్తున్నారా పరిశీలించారు. జిల్లాలో ఎవరైనా మాదకద్రవ్యాలు, గంజాయి తరలిస్తే 87126 56777 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Similar News
News December 7, 2025
ఏకగ్రీవ పంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్: కలెక్టర్

మెదక్ జిల్లాలో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎన్నికల కోడ్) అమల్లోనే ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకూ కోడ్ కొనసాగుతుందని తెలిపారు. ఏకగ్రీవంగా నిలిచిన గ్రామపంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్ యథాతథంగా అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
News December 7, 2025
తూప్రాన్: ‘కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇయ్యండి’

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. బీఆర్ఎస్‌లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.
News December 6, 2025
ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


