News March 27, 2025
సంగారెడ్డి: ‘జిల్లాలో బడి లేని ఆవాసాలు 335’

సంగారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సీఆర్పీలు నిర్వహించిన సర్వేలో 335 ఆవాస ప్రాంతాలలో బడులు లేనట్లుగా గుర్తించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు సమగ్ర శిక్ష పరిధిలోని సీఆర్పీలు క్షేత్ర స్థాయికి వెళ్లి సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలు లేని ఆవసాలు 5, ప్రాథమికోన్నత పాఠశాలలు లేని ఆవసాలు 190, ఉన్నత పాఠశాలలు లేనివి 140గా గుర్తించారు.
Similar News
News November 11, 2025
విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
News November 11, 2025
వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.
News November 11, 2025
ఆగాకర సాగు – అనుకూల పరిస్థితులు

ఆగాకర తీగజాతి పంట. అన్ని రకాల నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. అధిక కర్బన పదార్థం, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రు కలిగిన ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం. ఉదజని సూచిక 6-7 ఉన్న నేలలు సాగుకు అనువైనవి. ఆగాకర అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో పంట పెరుగుదల బాగుంటుంది. 32-40 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతల మధ్య అధిక దిగుబడిని, నాణ్యతను పొందవచ్చు.


