News January 27, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ ఆత్మహత్య

వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆలంపల్లికి చెందిన పావని(27), నిజాంపూర్ వాసి సాయికిరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త సాయి కిరణ్, అత్త, మరిది వేధింపులు తట్టుకోలేక ఆమె ఉరేసుకుని చనిపోయింది. సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 10, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

• తల్లితో గొడవపడి భద్రాచలం బాలిక ఆత్మహత్య• రైతు భరోసాకు ఎగనామం పెట్టారు: CPIML• పదో తరగతి విద్యార్థులపై దృష్టి సారించాలి: ఎమ్మెల్యే జారే • పాల్వంచ పెద్దమ్మతల్లి గుడిలో ముగిసిన పూజలు • సేవాలాల్ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ • ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు: అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్• బూర్గంపాడులో యథేచ్ఛగా ఇసుక రవాణా • గుండాలలో యువకుడి మృతి
News February 10, 2025
టీచర్ MLC అభ్యర్థిగా మల్లారెడ్డి నామినేషన్ దాఖలు

సిద్దిపేటకు చెందిన జగ్గు మల్లారెడ్డి టీచర్ MLC అభ్యర్థిగా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ ఉన్నందున తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. తనకు మద్దతిచ్చి గెలిపిస్తే చట్టసభల్లో తన గొంతు వినిపిస్తానన్నారు. రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
News February 10, 2025
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ: డిఐఈఓ

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కమిటీ కన్వీనర్ కే రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈనెల 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు.