News March 13, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.
Similar News
News February 23, 2026
AIADMK హామీలు: మహిళలకు ₹2,000.. పురుషులకూ ఫ్రీ బస్సు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో AIADMK చీఫ్ పళనిస్వామి హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు ₹2,000 సాయం అందిస్తామన్నారు. మహిళలతో పాటు పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని, పేదలకు ఇళ్లు, ఆటో డ్రైవర్లకు సబ్సిడీలు ఇస్తామని ప్రామిస్ చేశారు. DMK సర్కార్ ఒక ‘ఫెయిల్యూర్ మోడల్’ అంటూ విమర్శలు గుప్పించారు.
News February 23, 2026
బాఫ్టాలో భారతీయ సినిమా ‘బూంగ్’ చరిత్ర.. బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా అవార్డు!

BAFTA-2026 అవార్డుల్లో మణిపురీ చిత్రం ‘Boong’ సత్తా చాటింది. ‘బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిలిం’ కేటగిరీలో అవార్డు గెలుచుకొంది. ఈ విభాగంలో బాఫ్టా అవార్డు అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘జూటోపియా 2’ వంటి సినిమాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం. లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించారు.
News February 23, 2026
జీవన విధానం ఎలా ఉండాలో చెప్పే శ్లోకం

ఆపదర్థం ధనం రక్షేత్ దారాన్ రక్షే ద్ధనై రపి|
ఆత్మానం సతతం రక్షేత్ దారై రపి ధనై రపి||
భవిష్యత్తులో వచ్చే కష్టాల కోసం ధనాన్ని దాచుకోవాలి. అవసరమైతే ఆ ధనాన్ని ఖర్చు చేసైనా కుటుంబాన్ని రక్షించుకోవాలి. కానీ, ప్రాణ సంకట సమయంలో ధనం, కుటుంబం కంటే తన్ను తాను కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. తాను జీవించి ఉంటేనే కదా మళ్లీ సంపదను, సంసారాన్ని చూసుకోగలడు!


