News March 13, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.
Similar News
News March 14, 2025
ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.
News March 14, 2025
BREAKING: ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హోలీ పండుగ వేళ ఆదిలాబాద్లో విషాదం జరిగింది. పట్టణంలోని ఎరోడ్రం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతుండగా ఇద్దరు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదంలో రిషి కుమార్ అనే యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు ప్రేమ్కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ సునీల్ కుమార్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
‘పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలి’

పశు బీమాను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డున్న పాడి రైతులంతా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52,98,000 బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు.