News March 13, 2025

సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

image

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.

Similar News

News March 21, 2025

స‌మీకృత పంట కుంట‌ల ప్రాధాన్యాన్ని చాటిచెప్పండి: కలెక్టర్ 

image

మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా పొలాల్లో స‌మీకృత నీటికుంట‌లు ఏర్పాటు చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై రైతుల‌కు పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కలెక్టర్ ల‌క్ష్మీశ జిల్లా నీటి యాజ‌మాన్య సంస్థ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లుపై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం నిర్వ‌హించారు. 

News March 21, 2025

BREAKING: పరీక్ష వాయిదా

image

AP: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ అంబేడ్కర్ గురుకులాల్లో 2025-26కు గాను ఐదో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌‌లో ప్రవేశాలకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు వెల్లడించింది. దీన్ని అదే నెల 13న నిర్వహిస్తామని తెలిపింది.

News March 21, 2025

‘టాక్సిక్’ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్న కియారా!

image

రాకింగ్ స్టార్ యశ్, కియారా కాంబోలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా మారనున్నట్లు వెల్లడించాయి. కాగా, SSMB29 కోసం ప్రియాంకా చోప్రా రూ.30 కోట్లు తీసుకుంటున్నారని టాక్.

error: Content is protected !!