News March 3, 2025

సంగారెడ్డి: జిల్లాలో రెండు ఆస్పత్రులపై చర్యలు

image

జహీరాబాద్‌లోని నీలం, సంగారెడ్డిలోని వెల్ నెస్ హాస్పిటల్‌లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి ఆదివారం తెలిపారు. బాలింత మహానంది మరణంతో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రుల వివరాలు సేకరించినట్లు చెప్పారు. వెల్‌నెస్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.

Similar News

News March 21, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్టీవో, పోలీస్ అధికారులకు సూచించారు. అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో గుర్తించి బ్లాక్ స్పాట్లుగా నమోదు చేయాలని తెలిపారు.

News March 21, 2025

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

image

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.

News March 21, 2025

మెదక్: రూ.1,70,42,046 ఆస్తిపన్ను చెల్లించిన జిల్లా జడ్జి

image

మెదక్ కోర్టు భవనాల ఆస్తి పన్ను బకాయి మొత్తాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద చెల్లించారు. జిల్లా జడ్జికి మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలంగా కోర్టు భవనాల ఆస్తిపన్ను బకాయి ఉండడం వల్ల ఈ విషయాన్ని జిల్లా జడ్జి లక్ష్మీ శారద దృష్టికి మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి రూ.1,70,42,046 ను గురువారం చెల్లించారు.

error: Content is protected !!