News March 10, 2025
సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
SRCL: ‘ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి’

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, గజసింగవరం, గోరంటాల, గంభీరావుపేట, లింగన్నపేట, ముస్తఫానగర్, ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, పదిర, రాగట్లపల్లి, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, తిమ్మాపూర్, కిషన్ దాస్ పేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తనిఖీ చేశారు.
News November 22, 2025
పూలు, సుగంధ ద్రవ్యాల సాగుపై దృష్టి సారించాలి: ప్రేమ్ సింగ్

నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి, DPT డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ప్రేమ్ సింగ్ శనివారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్, డ్రిప్, పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకం పథకాల అమలును ఆయన పరిశీలించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పూలు, సుగంధ ద్రవ్యాల సాగును పెంచాలని సూచించారు. రైతులకు డ్రిప్ పరికరాలను సకాలంలో అందించాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
News November 22, 2025
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక పాత్ర పోషించిన డీసీపీ దార కవితను ప్రభుత్వం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించింది. వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కవిత 2010 గ్రూప్-1లో డీఎస్పీగా చేరారు. ప్రస్తుతం HYD కమిషనరేట్లో డీసీపీగా పనిచేస్తున్నారు. కాగా గతంలో శ్రీనివాస్ అనే అధికారిని నియమించినా, చేరేలోగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో తాజాగా కవిత నియమితులయ్యారు.


