News February 1, 2025

సంగారెడ్డి జిల్లాలో  57 మంది బాల కార్మికుల విముక్తి

image

సంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ స్మైల్ -XLలో 57 మంది బాల కార్మికులను విముక్తి కల్పించినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని, బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా 112కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్ టీంను అభినందించారు.

Similar News

News February 25, 2026

రేపే నెల్లూరుకు జగన్.. టైమింగ్స్ ఇవే!

image

మాజీ సీఎం జగన్ నెల్లూరులో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గొలగమూడి రోడ్డులోని VPR కన్వెన్షన్ హాలుకు వస్తారు. అక్కడ వివాహ వేడుకల్లో పాల్గొని 10.45 గంటలకు బెంగళూరు వెళ్తారు.

News February 25, 2026

నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల(M) గంటవానిపల్లి వద్ద రూ.456 కోట్లతో చేపడుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తర్లుపాడులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత సీఎం అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.

News February 25, 2026

కృష్ణా: మంత్రి లోకే‌శ్‌కు అభినందనలు తెలిపిన ఏపీ హైకోర్టు

image

కేజీబీవీల టీచర్ల జీతాలు పెంచుతామని, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలను AP హైకోర్టు ప్రశంసించింది. సమస్యలపై స్పందించిన మంత్రి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని కోర్టు తెలిపింది. హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై స్పందించిన తీరును అభినందించింది. అయితే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.