News February 1, 2025
సంగారెడ్డి జిల్లాలో 57 మంది బాల కార్మికుల విముక్తి

సంగారెడ్డి జిల్లాలో ఆపరేషన్ స్మైల్ -XLలో 57 మంది బాల కార్మికులను విముక్తి కల్పించినట్లు సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని, బాలలను కార్మికులుగా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల కార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే టోల్ ఫ్రీ నంబర్ 1098 లేదా 112కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ స్మైల్ టీంను అభినందించారు.
Similar News
News February 19, 2025
కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.
News February 19, 2025
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని విజయనగరంలో ఆందోళన

ఈనెల 23న జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని విజయనగరంలో అభ్యర్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో తీర్పు వెలువడిన తర్వాతే పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. తక్షణమే పరీక్ష నిర్వహిస్తే అభ్యర్థులు నష్టపోతారన్నారు. కేసులన్నీ పరిష్కరించి ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కోట జంక్షన్ వరకు ర్యాలీ చేశారు.
News February 19, 2025
ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.