News April 15, 2025

సంగారెడ్డి జిల్లాలో 710 పాఠశాలలు ఎంపిక

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో యుడైస్ పోర్టులో నమోదు చేసిన విద్యార్థుల సంఖ్యను పరిశీలించడానికి జిల్లాలో 710 పాఠశాలలను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. 52 మంది డిఎడ్, బిఎడ్ చదువుతున్న విద్యార్థులు రేపటి నుంచి ఈనెల 21 వరకు ఎంపిక చేసిన పాఠశాలలను పరిశీలించనున్నారని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

నెమ్లి: రెజ్లింగ్‌లో నేషనల్ లెవెల్‌కి ఎంపిక

image

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో గల నెమ్లికి చెందిన నిహారిక అనే విద్యార్థిని రెజ్లింగ్ విభాగంలో నేషనల్ లెవెల్‌కి ఎంపికైనట్టు స్కూల్ హెడ్ మాస్టర్ బాలరాజు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో స్టేట్ లెవెల్‌లో గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ తీసుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ నిహారికను సన్మానించి నేషనల్ లెవెల్‌లో కూడా గెలవాలని అభినందించారు.

News November 24, 2025

పెద్దపల్లి: ‘కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి’

image

కార్మిక సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికులు తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు కార్మిక సంక్షేమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుల కోసం పెద్దపల్లి 9492555258, మంథని 9492555248, గోదావరిఖని 9492555284 కార్మిక అధికారులను సంప్రదించాలని సూచించారు.

News November 24, 2025

కామరెడ్డి: చెక్కులు ఇచ్చింది వీళ్లకే..!

image

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు KMR ఎస్పీ రాజేష్ చంద్ర భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గాంధారి PSకు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్, పిట్లం PSకు చెందిన కె. బుచ్చయ్య మృతిచెందారు. SBI పోలీస్ సాలరీ ప్యాకేజ్ స్కీమ్ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇన్సూరెన్స్ చెక్కులను SP అందజేశారు.