News March 7, 2025

సంగారెడ్డి: జిల్లా ఎస్పీ రూపేశ్ బదిలీ

image

సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నా చెన్నూరి రూపేశ్‌ను నార్కోటిక్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పారితోష్ పంకజ్‌ను నియమించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

Similar News

News February 25, 2026

యువతకు AI శిక్షణ: పల్నాడు కలెక్టర్‌

image

జిల్లాలో సంప్రదాయ వృత్తులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ అత్యాధునిక సాంకేతికతపై అవగాహన కల్పించాలన్నారు. పలు సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 25, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 25, 2026

కామారెడ్డి: ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు సూచనలకు 9866143782, 9948164514 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు.