News March 7, 2025
సంగారెడ్డి: జిల్లా ఎస్పీ రూపేశ్ బదిలీ

సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నా చెన్నూరి రూపేశ్‌ను నార్కోటిక్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పారితోష్ పంకజ్‌ను నియమించారు. బదిలీ అయిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.
Similar News
News March 23, 2025
కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పట్టణంలోని అల్లూరి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సందర్భంలో పసల కృష్ణమూర్తి కుమార్తె పసల కృష్ణ భారతి కాళ్లకు నమస్కరించారు. ఆ సందర్భంలో కృష్ణ భారతి మోదీ తల్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుడే పసల కృష్ణ భారతి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన కృష్ణభారతి ఆదివారం మృతి చెందడంతో పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
News March 23, 2025
ఈ నెల 31 వరకు గడువు: VZM కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశమని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని కలెక్టర్ వెల్లడించారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటిఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు ఇంటర్న్ షిప్ పొందవచ్చాన్నారు.
News March 23, 2025
ఆస్పత్రిలో చేరిన అల్లు అర్జున్ నాయనమ్మ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం (95) ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యులు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కాగా కనకరత్నం గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అన్న విషయం తెలిసిందే.