News March 11, 2025
సంగారెడ్డి: జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతన ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం కలిశారు. ఎస్పీగా బదిలీపై వచ్చిన పారితోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ ఎస్పీగా పని చేసిన చెన్నూరి రూపేష్ హైదరాబాదులోని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీపై వెళ్లారు.
Similar News
News March 11, 2025
తిరుపతిలో అత్తను చంపిన అల్లుడి అరెస్ట్

తిరుపతి చిన్నగుంటలో ఈనెల 7న ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానికంగా ఉన్న గోపాల్ రెడ్డి భార్య ప్రమీల పాచిపనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె అల్లుడు రవీంద్ర నాయక్ మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మద్యాన్ని డబ్బులు ఇవ్వాలని ఆమెను కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ప్రమీలను కట్టేసి కాళ్లతో తన్ని గొంతు నులిమి హత్య చేశాడు.
News March 11, 2025
MBNR: మహిళలకు ఉచిత శిక్షణ.. APPLY చేసుకోండి..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. బ్యూటీపార్లర్ కోర్సులో ఈనెల 13లోగా SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. వయస్సు 19-45 ఏళ్లలోపు ఉండాలన్నారు.
News March 11, 2025
హనుమకొండ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

హనుమకొండ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.