News January 31, 2025
సంగారెడ్డి: జిల్లా, మండల స్థాయి అధికారులకు 10th విద్యార్థుల బాధ్యత

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఒక్కో పాఠశాలకు జిల్లా, మండల స్థాయి అధికారులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఆయా అధికారులకు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి 10వ తరగతి విద్యార్థుల పర్ఫార్మెన్స్‌ను తెలుసుకోవాలని పేర్కొన్నారు. నివేదికలను ఎప్పటికప్పుడు తనకు సమర్పించాలని ఆదేశించారు.
Similar News
News February 12, 2025
గ్రేటర్ HYD లైబ్రరీల్లో సిబ్బంది కొరత..!

గ్రేటర్ HYDలోని అనేక గ్రంథాలయాల్లో ఇప్పటికి సిబ్బంది లేక తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నట్లు పాఠకులు తెలుపుతున్నారు. సెంట్రల్ లైబ్రరీ సహా, HYD కేంద్రంగా ఉన్న అనేక గ్రంథాలయాల్లో తృతీయ శ్రేణి రికార్డు సహాయకులు సైతం లేరు. గ్రంథాలయాలలో ఉన్న ఖాళీలన్నింటిని నింపాలని విద్యార్థులు, పాఠకులు డిమాండ్ చేస్తున్నారు.
News February 12, 2025
వైరా: నిలిచిపోయిన బీర్ల సరఫరా!

వైరాలోని IMFL డిపో నుంచి మంగళవారం బీర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.150గా ఉన్న లైట్ బీర్ బాటిల్ ధర రూ.180కి, స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర రూ.40 మేర పెంచుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బార్లు, వైన్స్‌ల నిర్వాహకులు బీర్ల స్టాక్ తీసుకెళ్లలేదు. బుధవారం స్టాక్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News February 12, 2025
మేడ్చల్ జిల్లాలో సిజేరియన్‌లు భారీగా పెరిగాయి

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు పెరుగుతున్నాయి. కొద్దిసేపు గర్భిణీకి నొప్పులు రాగానే తట్టుకోలేకపోవడంతో ఒత్తిడి తెచ్చి కుటుంబీకులు సీజేరియన్ కోసం అడుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒక్క జనవరిలోనే జిల్లాలో 56కుపైగా సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. సాధారణ ప్రసవాలకు మించి సిజేరియన్ ఆపరేషన్లు జరగుతుండటంతో పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.