News February 1, 2025
సంగారెడ్డి: జిల్లా వాసికి భారతీయ యువ పురస్కార్ అవార్డు

నాగలిగిద్ద మండలంలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన ఎర్త్ లీడర్ పాలడుగు జ్ఞానేశ్వర్‌కు కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన భారత వికాస్ భారతీయ సంస్కృతి ఉత్సవ్ 7లో జాతీయ కన్వీనర్ మాధవరెడ్డి చేతుల మీదుగా భారతీయ యువపురస్కార్ అవార్డు ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణపై పోరాటం చేస్తున్న జ్ఞానేశ్వర్‌కు ఈ అవార్డు రావడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
Similar News
News November 18, 2025
రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.
News November 18, 2025
ఖైదీని మార్చిన పుస్తకం!

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.
News November 18, 2025
గ్రేటర్ తిరుపతి ఇలా..!

తిరుపతి కార్పొరేషన్ విస్తరణలో భాగంగా 63 గ్రామాలు విలీనం కానున్నాయి. తిరుపతి రూరల్ మొత్తం కార్పొరేషన్‌లో కలిపేస్తారు. చంద్రగిరి మండలంలోని 21 గ్రామాల్లో 13 గ్రేటర్‌లో కలుస్తాయి. విలీనంతో నగర జనాభా 4.52 లక్షల నుంచి 7.86 లక్షలకు చేరనుంది. ఆదాయం సైతం రూ.149 కోట్ల నుంచి రూ.192.20 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం తిరుపతి విస్తీర్ణం 30.174 చ.కిమీ ఉండగా విలీనంతో 300.404 చ.కిమీకు పెరగనుంది.


