News March 6, 2025

సంగారెడ్డి: జిల్లా స్థాయికి 124 ప్రాజెక్టులు ఎంపిక

image

ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 3,311 ప్రాజెక్టులు ఎంపికవ్వగా కేవలం సంగారెడ్డి జిల్లా నుంచే 124 ప్రాజెక్టులు జిల్లా స్థాయి DLEPCకి ఎంపికయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఎంపికైన పాఠశాల విద్యార్థులు, వారి గైడ్ టీచర్లకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, సెక్రటరీ లింబాజి, సైన్స్ అధికారి సిద్ధారెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 8, 2026

MDK: మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News February 8, 2026

నర్సాపూర్: పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ తనిఖీ

image

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నర్సాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఫెసిలిటేషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News February 8, 2026

YS జగన్‌తో TVK విజయ్

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.