News August 3, 2024

సంగారెడ్డి: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

image

వాతావరణంలోని మార్పుల కారణంగా సంగారెడ్డి జిల్లా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వర పీడితులతో దావాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషేంట్ కేసులు అధికంగా నమోదైతున్నాయి. జిల్లాలో అధికారికంగా 70 డెంగీ కేసులు నమోదు కాగా, అధికారుల దృష్టికి రాని కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో 1415 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి.

Similar News

News September 11, 2024

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పెంపు

image

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మెన్స్ కం మెరిట్ స్కాలర్షిప్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 25 వరకు ప్రభుత్వం పొడిగించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News September 11, 2024

చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ హెచ్ఎండిఏ వెబ్ సైట్లో 8 మండలాలకు సంబంధించిన మ్యాపింగ్ ఉంచాలని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News September 11, 2024

సంగారెడ్డి: కేజీబీవీ ఉద్యోగుల మెరిట్ జాబితా విడుదల

image

2023-24 సంవత్సరం కేజీబీవీ అభ్యర్థుల 1:3 మెరిట్ జాబితాను www.deosangareddy.in వెబ్ సైట్ లో ఉంచినట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జాబితాలో పేర్లు ఉన్నవారు 13వ తేదీన కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని చెప్పారు. ఆ తర్వాత 1:1 మెరిట్ జాబితాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే 18వ తేదీలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలన్నారు.