News January 28, 2025

సంగారెడ్డి: టీచర్లకు ఈఎల్స్ మంజూరు: DEO

image

వేసవి సెలవుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు మాత్రమే ఈఎల్స్ మంజూరు చేసినట్లు చెప్పారు. వీటిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈఎల్స్ మంజూరు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 16, 2025

కొమురవెల్లి: మల్లన్న కళ్యాణం, జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం, జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ హైమావతి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొమురవెల్లిలో 14 డిసెంబర్ నుంచి 16 మార్చి 2026 వరకు జరిగే కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 16, 2025

గురక గాఢనిద్రకు సంకేతం కాదు: వైద్యులు

image

చాలా మంది గురకను గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అందులో నిజం లేదంటున్నారు వైద్యులు. ‘గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. దీని వలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాఢనిద్ర పట్టదు. తరచుగా గురక వస్తున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు’ అని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురక పెడితే వైద్యుడిని సంప్రదించండి.

News November 16, 2025

HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

image

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.