News February 17, 2025
సంగారెడ్డి: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో..!

MDK-KNR-NZB-ADB టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News November 17, 2025
ASF: వడ్డీ వ్యాపారులకు చిరు వ్యాపారులే టార్గెట్

ASF జిల్లాలో ఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారులు పేదలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధిక వడ్డీలు విధించి చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తున్నారు. కట్టలేకపోతే బెదిరింపులు, గొడవలు రోజువారీగా మారాయి. అనుమతులు లేకుండా రూ.కోట్ల లావాదేవీలు జరిపినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. గతంలో వడ్డీ వ్యాపారులపై దాడులు కూడా జరిగిన వారి దందా మాత్రం ఆగడం లేదు.
News November 17, 2025
ఖమ్మం టీహబ్లో సాంకేతిక సమస్యలు!

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
News November 17, 2025
ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


