News February 17, 2025
సంగారెడ్డి: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో..!

MDK-KNR-NZB-ADB టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News April 17, 2026
అన్నమయ్య: జలధార ప్రాజెక్ట్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన జలధార–జలహారతి ప్రాజెక్ట్ పనితీరుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు చెందిన బృందం ప్రశంసలు కురిపించింది. ఈనెల16న జిల్లాకు వచ్చిన కేంద్రబృందం గురు, శుక్రవారాల్లో చిట్వేల్, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, ఓబులవారిపల్లె, రామాపురం, బి.కొత్తకోట, కురబలకోట, చిన్నమండెం, సీటీఎం, బసినికొండ, రాయచోటి మండలాల్లో విస్తృతంగా పర్యటించింది. జలధార ప్రాజెక్ట్ అమలు బాగుందని కొనియాడింది.
News April 17, 2026
LNG ఇంపోర్ట్స్.. భారత్‌కు ఇక బోలెడన్ని ప్రత్యామ్నాయాలు!

LNG కోసం ఇప్పటివరకు ఎక్కువగా ఖతర్‌పైన ఆధారపడిన భారత్ పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో కొత్త సోర్సులను కనెక్ట్ చేసుకుంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత నార్వే నుంచి, రెండేళ్ల విరామం తర్వాత రష్యా నుంచి భారత్‌కు త్వరలో LNG కార్గోలు రానున్నట్లు సమాచారం. ఇక ఆఫ్రికా దేశాల నుంచి 1.2 మిలియన్ టన్నుల LNGకి భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో ఆరు నౌకలు గత నెల భారత్ చేరుకోగా మరో 7,54,000 టన్నుల LNG ఈనెలాఖరుకు రానుంది.
News April 17, 2026
హెచ్‌పీవీ టీకా కార్యక్రమం వేగవంతం చేయాలి: కలెక్టర్

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఆయుష్ సేవలు, యోగా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తెలిపారు. హెచ్‌పీవీ టీకాలు రెండు నెలల్లో 6 వేలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్బీఎస్‌కే ద్వారా పిల్లల పరీక్షలు, గర్భిణుల సంరక్షణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపుపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.


