News February 12, 2025
సంగారెడ్డి: టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంగారెడ్డి డివిజన్‌లో 25 , మెదక్ డివిజన్‌లో 24 గ్రామీణ్ డాక్ సేవక్(GDS) పోస్టులు ఉన్నాయి. దీనికి టెన్త్ అర్హత, వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News October 30, 2025
పంట నష్టం నివేధికను తయారు చేయాలి: కలెక్టర్

జిల్లాలో తుపాను ప్రభావం వల్ల పంట నష్టాల నివేధికను తయారు చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో ఆయన మాట్లాడారు. తుపాను ప్రభావంవల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు, కృష్ణా నది, నల్లమడ కాలువలు ప్రవాహం ఎక్కువగా ఉన్నందున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలన్నారు.
News October 30, 2025
పెద్దన్నవారిపల్లికి సీఎం చంద్రబాబు రాక

సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. నవంబర్ 1న తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ సతీశ్ కుమార్ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.
News October 30, 2025
WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.


