News March 19, 2025
సంగారెడ్డి: టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 22,411 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు.
Similar News
News March 20, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన నేతలు
> జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్మీడియట్ పరీక్షలు
> పాలకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> బచ్చన్నపేట: ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ చోరీ
> హెలికాప్టర్లో వచ్చిన మంత్రులు ఏం చేయలేదు: పల్లా
> పాలకుర్తి, కొడకండ్లలో ఠాణు నాయక్ వర్ధంతి కార్యక్రమం
> STN: భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
News March 20, 2025
అధికారులకు సూచనలు చేసిన మేయర్, కమిషనర్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ఎజెండాపై అధికారులకు వారు పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
News March 19, 2025
సిరిసిల్ల: మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు ఉండకూడదు: కలెక్టర్

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఆటంకాలు ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి, సరఫరా, ల్యాబ్‌ను పరిశీలించారు. నీటిని శుద్ధిచేసే ప్రక్రియను క్షుణ్నంగా కలెక్టర్‌కు మిషన్ భగీరథ ఇంజినీర్లు వివరించారు.