News January 21, 2025

సంగారెడ్డి: టెన్త్ పరీక్షలు రాసేవారికి చివరి ఛాన్స్

image

ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగియనుందని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. రూ.1000 అపరాధ రుసుంతో కలిపి రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు రేపటి వరకు చెల్లించాలన్నారు. ఇదే చివరి తేదీ అని, ఇక మీదట పొడిగింపు ఉండదని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News July 8, 2025

మెదక్: 86 శాతం మందికి పంపిణీ

image

మెదక్ జిల్లాలో మూడు నెలల కోటాకు సంబంధించి బియ్యం పంపిణీ 86 శాతం మంది రేషన్ దారులు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 2,16,716 కార్డుదారులు ఉండగా, 1,86,578 మంది బియ్యం తీసుకున్నారని డీఎస్‌వో నిత్యానందం తెలిపారు. జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం జూన్‌ 1 నుంచి 30 వరకు పంపిణీ చేశారు. మళ్లీ సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.

News July 8, 2025

రామాయంపేట: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగ అవకాశాలు

image

రామాయంపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్ HBT బోధించేందుకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివిన అభ్యర్థులకు అవకాశం ఉందని, రూ.18,200 వేతనం అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 8, 2025

రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలి: మెదక్ కలెక్టర్

image

రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కొల్చారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల భద్రత క్రమ పద్ధతిలో ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై జవాబుదారితనం అవసరమన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.