News February 21, 2025
సంగారెడ్డి: ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బందిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

కంగ్టిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో సిబ్బంది విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పందించారు. వసతి గృహంలో ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులతో చేయించడాన్ని ఆమె తప్పుబట్టారు. హాస్టల్ సిబ్బందిపై విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డిఓ ఎస్.అశోక్ చక్రవర్తిని ఆదేశించారు.
Similar News
News February 22, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పాల్వంచ: రూ.26 లక్షలు చోరీ.. నిందితులు అరెస్ట్ ✓ అకాల వర్షాలతో మిర్చి పంటకు నష్టం ✓ ఇల్లందు రోడ్డు ప్రమాదంలో మహిళలకు తీవ్ర గాయాలు ✓ మణుగూరులో ఐటీడీఏ పీవో ఆకస్మిక పర్యటన ✓ KTRను కలిసిన మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు ✓ చర్ల: తునికాకు సరైన ధర నిర్ణయించాలి: CPIML ✓ జూలూరుపాడు గిరిజనుడి 7 ఎకరాల భూమి కబ్జా: ఆదివాసీలు ✓ కేసుల విషయంలో జాప్యం చేస్తే సహించేది లేదు: ఎస్పీ.
News February 22, 2025
GWL: ‘తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి’

రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టరేట్లో త్రాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయితీలో మున్సిపల్ పరిధిలో నీటి సరఫరాను మెరుగు పరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
News February 22, 2025
చిత్తూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

✒ తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక.. ఏపీ CS, DGPకి నోటీసులు
✒ తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
✒ వెదురుకుప్పంలో అగ్ని ప్రమాదం
✒ బెంగళూరు-చెన్నై హైవేపై ప్రమాదం
✒ చిత్తూరులో 19 మందికి జరిమానా
✒ తిరుపతి: ఒకే వేదికపై 100 మంది కవలలు
✒ వ్యవసాయ సంఘాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్