News February 21, 2025
సంగారెడ్డి: ట్రైబల్ వెల్ఫేర్ సిబ్బందిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

కంగ్టిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల వసతి గృహంలో సిబ్బంది విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పందించారు. వసతి గృహంలో ఉదయం అల్పాహారాన్ని విద్యార్థులతో చేయించడాన్ని ఆమె తప్పుబట్టారు. హాస్టల్ సిబ్బందిపై విచారణ చేపట్టి రిపోర్టు సమర్పించాలని నారాయణఖేడ్ ఆర్డిఓ ఎస్.అశోక్ చక్రవర్తిని ఆదేశించారు.
Similar News
News March 24, 2025
తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.
News March 24, 2025
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి: ఎస్పీ కిరణ్ ఖరే

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్లో 21 మంది ఆర్జీదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని, ప్రతి కేసుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 24, 2025
నెల్లూరు: ఆన్లైన్లో పరిచయం.. రూ.18 లక్షల మోసం

హనీట్రాప్కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.