News November 30, 2024
సంగారెడ్డి: డిసెంబర్ 4న ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ
సంగారెడ్డి కలెక్టరేట్లో డిసెంబర్ 4న ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ షమీమ్ అత్తర్ బహిరంగ విచారణకు హాజరవుతారని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఎస్సీ కుల సంఘాల నాయకులు బహిరంగ విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
Similar News
News November 30, 2024
సీజనల్ వ్యాధుల నిర్మూలనపై మంత్రి సమీక్ష
రాష్ట్రంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యా,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News November 29, 2024
ప్రియాంక గాంధీని కలిసిన జహీరాబాద్ ఎంపీ
వయునాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రియాంక గాంధీని శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షేట్కార్ కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు అన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు.
News November 29, 2024
సిద్దిపేటలో రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.