News March 8, 2025
సంగారెడ్డి: డీఎడ్ ఫస్టియర్ ఫలితాలు విడుదల

డిసెంబర్-2024లో జరిగిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందని, పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. రీకౌంటింగ్‌కు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
సిరిసిల్ల: హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభించిన కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ సెంటర్, మీడియా సెల్‌ను ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. 24 గంటలు పనిచేసే ఈ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
News November 27, 2025
సిద్దిపేట: సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ప్రచారం

సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఆశావహులు సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సొంత వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని గ్రామ ఓటర్లందరిని చేర్చుకుని పోస్ట్‌లతో హడావిడి చేస్తున్నారు. ఫేస్ బుక్ పేజీ క్రియేట్ చేసి గ్రామ యువ ఓటర్లను చేర్చుకొని పోస్ట్‌లతో హంగామా చేస్తున్నారు. యూ ట్యూబ్‌లో ఛానెల్ క్రియేట్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ యువ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
News November 27, 2025
మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ కౌంటర్

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. SAతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోవడంపై “డోంట్ వర్రీ వసీం, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు”అని వాన్ అన్నారు. దీనిపై స్పందించిన జాఫర్..”నా బాధ త్వరలో తీరిపోతుంది. కానీ నువ్వు మరో 4 టెస్టులు భరించాలి”అని యాషెస్ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.


