News February 16, 2025

సంగారెడ్డి: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించిన డీఈవో

image

జిల్లాలో డీఎస్సీ 2008 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధి కారి వెంకటేశ్వర్లు శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. ఎంపికైన అభ్యర్థులకు నూతన పాఠశాలలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి వెంకటేశం, ఎడి శంకర్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

రిజల్ట్ తెలిసే KCR ప్రచారం చేయలేదు: రేవంత్

image

జూబ్లీహిల్స్‌లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని KTR చేసిన విమర్శలపై రేవంత్ స్పందించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టే జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇతర చోట్ల ఉపఎన్నికలు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ప్రచారం చేశానన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలుపుపై KCRకు నమ్మకం లేదన్నారు. అందుకే సునీతను గెలిపించాలని కనీసం ప్రకటనైనా విడుదల చేయలేదని కౌంటర్ వేశారు.

News November 9, 2025

మంచి మనసు చాటుకున్న శ్రీచరణి

image

వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె ట్రైనింగ్ పొందిన కడప క్రికెట్ అకాడమీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీచరణిని అభినందిస్తూ కడప టీడీపీ అధ్యక్షుడు, కమలాపురం MLA రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వాటిని అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న అండర్-14 క్రికెట్ టీమ్ ప్రోత్సాహానికి కేటాయించాలని శ్రీచరణి కోరారు.

News November 9, 2025

ప్రతి రైతుకు పరిహారం అందాలి: మంత్రి పొన్నం

image

మొంథా తుఫాన్ నష్టాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, పక్కాగా నివేదిక తయారు చేయాలని సూచించారు. రోడ్లు, విద్యుత్తు, నీటిపారుదల శాఖలకు సంబంధించి దెబ్బతిన్న నిర్మాణాలు, పంట నష్టాన్ని పూర్తి ఆధారాలతో నివేదించాలని, నష్టపోయిన వారికి సహాయం అందించాలని ఒక ప్రకటన విడుదల చేశారు.