News March 18, 2025

సంగారెడ్డి: తండ్రి, కూతురు, కొడుకు అదృశ్యం..

image

ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి అదృశ్యమైన ఘటన సంగారెడ్డిలో జరిగింది. జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి పీఎస్ పరిధిలోని పర్వతాపూర్‌కు చెందిన గోపాల్ రెడ్డి (38) జనవరి 17న తన కూతురు తనుష రెడ్డి, కొడుకు సాత్విక్ రెడ్డిలతో కలిసి సంగారెడ్డికి వెళ్లి ఇప్పటికి తిరిగి రాలేదని స్థానిక ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అతని తల్లి గురడి శోభమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 19, 2025

KNR: మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ

image

ఉమ్మడి KNR జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. శనివారం నాటికి కరీంనగర్ జిల్లా(94)లో 2,519, జగిత్యాల(71)లో 1,766, పెద్దపల్లి(74)లో 1354, రాజన్న సిరిసిల్ల(48)1,324 దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి.

News October 19, 2025

ఏలూరులో నేటి మాంసం ధరలు ఇలా!

image

నూజివీడులో మాంసం ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో మటన్ రూ.800 రూపాయలు, చికెన్ రూ.220, రొయ్యలు రూ.300 రూపాయలు, చేపలు రూ.180 నుంచి 380 రూపాయలకు విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కిలో మటన్ రూ.900 రూపాయలు, చికెన్ రూ.220 నుంచి 280 రూపాయలు, కిలో చేపలు రూ.150 నుంచి 400 రూపాయలు, కిలో రొయ్యలు రూ.300 రూపాయలుగా విక్రయిస్తున్నారు.

News October 19, 2025

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం

image

పదో తరగతి విద్యార్థులు ఈనెల 21 నుంచి పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది. ఈ మేరకు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పరీక్షల విభాగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష చెల్లించే సమయంలో విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలి. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హెచ్ఎంలను డీఈఓ ఆదేశించారు.