News February 13, 2025
సంగారెడ్డి: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372406156_50339027-normal-WIFI.webp)
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.
Similar News
News February 13, 2025
అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439018283_1045-normal-WIFI.webp)
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో భారీగా బలగాల్ని మోహరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ర్యాలీలు, సభల వంటివాటిపై నిషేధం ఉంటుందని, ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
News February 13, 2025
దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438533386_774-normal-WIFI.webp)
దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
News February 13, 2025
సీఎం రేవంత్ను గద్దె దించే ప్రయత్నం.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739438204944_1226-normal-WIFI.webp)
TG: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని కోసం 25 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. మరోవైపు ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.