News March 3, 2025
సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్లోని దివినో విల్లాస్లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించాగా…ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.
Similar News
News December 9, 2025
తూ.గో: డిప్యూటీ సీఎం శాఖలో జీతాల కష్టాలు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉద్యోగులు జీతాలు అందక ఆకలి కేకలు వేస్తున్నారు.
తూ.గో జిల్లా నీటి నాణ్యత పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆగస్టు నుంచి ఐదు నెలల వేతనాలు అందలేదు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ జీతాలు రాకపోవడంతో వేతన జీవుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
News December 9, 2025
ఎన్నికల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి: కలెక్టర్

ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పాత్ర కీలకమని జనరల్ అబ్జర్వర్ రవి కిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు, తహశీల్దార్లతో వారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని వారు ఆదేశించారు.
News December 9, 2025
నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్: కలెక్టర్

గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రకటించారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందన్నారు. పోలింగ్ పూర్తయ్యేవరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటి ప్రచార కార్యక్రమాలను నిర్వహించొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు.


