News March 3, 2025
సంగారెడ్డి: తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్‌లోని డివెన్ విల్లాస్‌లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.
Similar News
News March 15, 2025
గ్రూప్-3లో 24 ర్యాంక్ సాధించిన జిల్లా వాసి

ఆర్మూర్ పట్టణానికి చెందిన దొంద రామ్ కిషోర్ గ్రూప్-3 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి సత్తాచాటారు. 317 మార్కులతో రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంక్ సాధించారు. ఇటీవల ఆయన గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నిజామాబాద్‌లో కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
News March 15, 2025
రంప : పడిపోయిన టమాటా ధర

ఆరుగాలాలు కష్టపడి పంట పండించిన రైతుకు తన కష్టానికి తగిన మద్దతు ధర కూడా రాని పరిస్థితి నేడు నెలకొంది. అల్లూరి జిల్లాలో టమాటా రేటు బాగా పడిపోయింది. రంపచోడవరం పరిసర గ్రామాల్లో శనివారం హోల్ సేల్ మార్కెట్లో 10 కిలోలు టమాటా రూ. 100 పలికింది. రిటైల్ గా రూ.150 మాత్రమే పలికింది. ఈ సీజన్ దిగుబడి పెరిగి ఒకే సారి పంట మార్కెట్టుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు.
News March 15, 2025
ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి: మంత్రి

విజయనగరం మహిళా ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్కులర్ ఆక్వా కల్చర్ విధానాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఇదో కొత్త అవకాశమన్నారు. వెలుగు 2.0 ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.